ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో కొనసాగుతున్న అనిశ్చితి...వారం గడిచినా తెరుచుకోని బడి... - latest news in yanam

వారం గడిచినా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పాఠశాలలు తెరవటంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఏపీలోని బడుల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా సోకిన నేపథ్యంలో...యానాం ప్రభుత్వం తెరవాలా వద్దా అన్నదానిపై కసరత్తు చేస్తోంది.

schools-are-not-open-in-yanam
యానాంలో తెరుచుకొని బడులు

By

Published : Nov 7, 2020, 12:21 PM IST


తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండడంతో యానాంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానాలను అనుసరించే నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 2 నుంచి పాఠశాలలు తెరిచి 9,10 తరగతుల విద్యార్థులకు ఒక పూట తరగతులు నిర్వహిస్తున్నాయి. ఎనిమిది ప్రభుత్వ, ఐదు ప్రైవేట్ పాఠశాలు ఉన్న యానంలో మాత్రం బడులు తెరిచేందుకు పుదుచ్చేరి విద్యాశాఖ అనుమతులు ఇవ్వలేదు.

యానాంలో తెరుచుకొని బడులు

తల్లిదండ్రుల నుంచి అంగీకారపత్రాలు సమర్పించినా వెయ్యికిపైగా విద్యార్థినీ విద్యార్థులు ఇంటికే పరిమితమై... ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు వింటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో పాఠశాల తెరిచిన తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా కరోనా బారినపడుతుండటంతో యానాం అధికారులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం రోజువారీ 10 నుంచి 30 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున పాఠశాల తెరవాలా లేదా అన్నదానిపై సమీక్షలు జరుపుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా ప్రభావం: యానాంలో పడకేసిన పర్యటకం!

ABOUT THE AUTHOR

...view details