తూర్పుగోదావరి జిల్లా అలమూరు మండలం చెముడులంకలో ఓ పాఠశాలలో గోడకూలి ఆరేళ్ల విద్యార్థి మృతి చెందాడు. మూలస్థానం గ్రామానికి చెందిన ప్రసాద్ మధ్యాహ్న భోజన విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లగా గోడ కూలి బాలుడిపై పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పాఠశాల గోడ కూలి ఆరేళ్ల విద్యార్థి మృతి - school-wall-collapses-killing-six-year-old-student
పాఠశాల గోడ కూలి ఆరేళ్ల వయసున్న విద్యార్థి మృతి చెందాడు. పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్న తమ కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
పాఠశాల గోడ కూలి ఆరేళ్ల వయసున్న విద్యార్థి మృతి