తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల.. రాతి భవనంలో నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో 1910 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించారు. దీంట్లో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు.. రాళ్లతోనే నిర్మించారు. ఈ భవనం కూడా రాయితోనే నిర్మించారు. సువిశాలమైన గదులు, ఆర్చీలు, పెద్ద తలుపులు, కిటికీలు, చక్కటి వెలుతురు, స్వచ్ఛమైన గాలి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ రాతి భవనం ఉంది.
విద్యార్థులకు నెలవుగా.. రాయితో నిర్మించిన భవనం - అమలాపురంలో రాతి బడి వార్తలు
అదో ప్రభుత్వ పాఠశాల.. రాతి బడిగా పేరుపొందింది. ఇదేమిటి రాతి బడి అనుకుంటున్నారా.. అయితే దాని విశిష్టత తెలియాలంటే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లాల్సిందే.
విద్యార్థులకు నెలవుగా.. రాయితో నిర్మించిన భవనం
ఈ భవనం కట్టి 110 సంవత్సరాలైనా.. ఎక్కడా చెక్కుచెదరలేదు. నాటి నాణ్యత ప్రమాణాలకు ఈ భవనం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. రాతితో నిర్మించిన ఈ భవనంలో పాఠశాల నడుపుతున్న కారణంగా.. దీనికి రాతి బడి అని పేరువచ్చింది. విద్యార్థులుఈ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.. ఉపాధ్యాయులు సైతం ఎంతో ఆనంద పడుతుంటారు.
ఇదీ చదవండి:నమ్మకమూ.. పట్టుదల.. తన రెండు రెక్కలుగా...
TAGGED:
అమలాపురం వార్తలు