ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత.. 3 సిలిండర్లతో తాత్కాలిక ఏర్పాట్లు - Covid Hospital Amalapuram

ఆక్సిజన్ నిల్వలు అమాంతం తగ్గిపోయాయనే విషయాన్ని రోగి సహా కుటుంబీకులకు వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత.. 3 సిలిండర్లతో తాత్కాలిక ఏర్పాట్లు
ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత.. 3 సిలిండర్లతో తాత్కాలిక ఏర్పాట్లు

By

Published : May 9, 2021, 11:02 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆస్పత్రిలో కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా 30 పడకలు ఉండగా.. 30 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ నిల్వలు తక్కువ ఉండటంతో సాయంత్రం సంబంధిత రోగులకు, బంధువులకు సిబ్బంది విషయాన్ని తెలియజేశారు.

అందుబాటులో 3 సిలిండర్లు..

సమాచారం అందుకున్న అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్.. స్థానిక కిమ్స్ ఆస్పత్రి నుంచి 400 లీటర్ల సామర్థ్యం గల 3 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మరికొన్ని ఆక్సిజన్ సిలిండర్లు కాకినాడ నుంచి వస్తున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ వెల్లడించారు. ఆక్సిజన్​ నిల్వలు లేవనే విషయం రోగుల బంధువులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు.

ఇవీ చూడండి :నేర రాజకీయ క్రీడాంగణంపై నోరుమెదపరేం ?

ABOUT THE AUTHOR

...view details