విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ జల దీక్ష చేపట్టారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద గౌతమి గోదావరి నదిలో ఆయన జలదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే రెండు లక్షల కుటుంబాలు వీధిన పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు .
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాంటూ జలదీక్ష
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ జలదీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అమలు చేస్తే రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాంటూ జలదీక్ష