ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతుల కుటుంబాలకు కోటి పరిహారమివ్వాలని ఎస్సీ సంఘాల ఆందోళన - sc associations agitaition news in east godavari

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వివాదం నెలకొంది. శంఖవరం మండలం వజ్రకూటంలో నిర్మాణంలోని ఓ పరిశ్రమ వద్ద పనులు చేస్తుండగా.. ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై ఎస్సీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్​ చేస్తూ.. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.

మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని ఎస్సీ సంఘాల ఆందోళన
మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని ఎస్సీ సంఘాల ఆందోళన

By

Published : Jul 7, 2020, 12:25 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. శంఖవరం మండలం వజ్రకూటంలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమ వద్ద బోరు తవ్వుతుండగా.. విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని ఎస్సీ సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలోనే మృతదేహాలను ఖననం చేస్తామని హెచ్చరించారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details