పేదలకు ఎస్బీసీకేటీసీ సంస్థ చేయూత - sbc ktc latest news update
లాక్డౌన్ నేపథ్యంలో ఎస్బీసీకేటీసీ సంస్థ పేదలకు చేయూతను అందిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 3 కోట్లు వెచ్చించి పేదలకు, పోలీసులకు, పంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
![పేదలకు ఎస్బీసీకేటీసీ సంస్థ చేయూత sbc ktc organaigation distribution essential things](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7233740-165-7233740-1589708868656.jpg)
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు అండగా నిలవాలని ఎస్బీసీకేటీసీ సంస్థ నిర్ణయించుకుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఐదు వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ సంస్థ తరఫున దేశంలో ఐదు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలు వ్యయంతో పేదలకు ఆహారం, నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేయడంతోపాటు పోలీసులకు, పంచాయతీ కార్మికులు, సిబ్బందికి సేవలందించామని వివరించారు.