తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సత్యదేవుడు, అనంత లక్ష్మీ అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెలను చేసి ఉత్సవాలకు తెర తీశారు. ప్రధానాలయంలో అనివేటి మండపంలో పెళ్లి పెద్దలు, క్షేత్ర పాలకులు సీతారాముల వారి సమక్షంలో స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేశారు.
సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు ప్రారంభం - సత్యనారాయణ స్వామి కల్యాణం తాజా న్యూస్
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఉత్సవాలను కేవలం వైదిక బృందం ఆధ్వర్యంలోనే నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు కల్యాణం జరగనుంది.
ఘనంగా ప్రారంభమైన సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు
అనంతరం శాస్త్రోక్తంగా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలను చేశారు. లాక్‌డౌన్ అమల్లో ఉండటంలో వైదిక బృందం ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటలకు కల్యాణం జరగనుంది. కల్యాణానికి భక్తులు, వీఐపీలు, ప్రజా ప్రతినిధులు, మీడియాను కూడా అనుమతించడం లేదని అధికారులు తెలిపారు.