లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది పేదలకు తమ వంతు సాయంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు పేదలకు, రహదారులపై వెళ్లే ఇతర రాష్ట్రానికి చెందిన వలస కార్మికులకు బిర్యానీ ప్యాకెట్లను అందించారు. రోజుకు 2వేల ప్యాకెట్లను తయారుచేసి వలస కార్మికులకు పంపిణీ చేస్తున్నారు.
సత్యసాయి సేవా సంస్థ దాతృత్వం - తూర్పుగోదావరిలో సత్యసాయి సేవా సంస్థ ఆహారం పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేదలకు, వలసకూలీలకు సత్యసాయి సేవా సంస్థ... ఆహారాన్ని అందిస్తోంది. రోజుకు రెండు వేల మందికి ఆహారాన్ని తయారుచేసి పంపిణీ చేస్తోంది.
పేదలకు, వలసకూలీలకు ఆహారం పంపిణీ చేస్తున్న సత్యసాయి సేవా సంస్థ