తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, పెద్దాపురం సబ్డివిజన్లలోని శ్రీసత్యసాయి సేవా సంస్థలు 3వేల మంది వలస కూలీలకు ఆహారం అందించాయి. కిర్లంపూడి మండలం క్రిష్ణవరం టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై స్వగ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. సైకిళ్లపై, లారీల్లో, బస్సులో, నడిచి వెళ్తున్న వలస కూలీలకు పది రోజుల నుంచి ఆహారం ఏర్పాట్లు చేశామని సత్యసాయి సేవాసంస్థ సభ్యులు అన్నారు.
వలస కూలీలకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్టు భోజన ఏర్పాట్లు - తూర్పుగోదావరి జిల్లాలో వలసకూలీల తాజా వార్తలు
స్వంత గ్రామాలకు వెళుతున్న వలస కూలీలకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, పెద్దాపురం సబ్డివిజన్లలోని శ్రీసత్యసాయి సేవా ట్రస్టు ఆహారం అందించింది. 3 వేల కుటుంబాలకు ట్రస్టు నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేశారు.
వలసకూలీలకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్టు భోజన ఏర్పాట్లు