ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓటు వేయలేదని విద్యుత్, తాగునీటిని నిలిపివేశారు' - c rayavaram latest news

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని విద్యుత్, తాగునీటి సరఫరా నిలిపి వేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఓటు వేయలేదనే సర్పంచి.. వారం రోజులుగా విద్యుత్, నీటిని నిలిపివేశారని స్థానికులు ఆరోపించారు. వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

protest
ఆందోళన

By

Published : May 3, 2021, 10:39 AM IST

పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని గ్రామ సర్పంచి.. విద్యుత్, తాగునీరు సరఫరా నిలిపివేశారని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సి రాయవరం గ్రామంలోని దిగువ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకి ఓటు వేయలేదనే నెపంతో వారం రోజులుగా విద్యుత్, వీధి కుళాయిల ద్వారా వచ్చే తాగునీటిని సర్పంచి నిలిపివేశారని స్థానికులు ఆరోపించారు. దిగువ ప్రాంతంలో 38 కుటుంబాల వారికి వెంటనే విద్యుత్, తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details