సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఓ మహిళ భర్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అనంతరం గోవిందపురం అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో జరిగింది.
మండలంలోని గొల్లలగుంట గ్రామానికి చెందిన సబ్బేళ్ల పుష్పవతి తెదేపా మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను అపహరించి.. గోవిందపురం అడవిలో విడిచిపెట్టారని అన్నారు. ఎన్నికల్లో పాల్గొనకుండా వైకాపా అభ్యర్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పుష్పవతి ఆరోపించారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి బయటకు వచ్చే క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి వచ్చి మత్తుమందు ఇచ్చారు. అనంతరం దూరంగా తీసుకెళ్లి గోవిందపురం అడవిలో విడిచిపెట్టారు. పశువుల కాపరులు ఉదయం నన్ను రక్షించారు. - సర్పంచ్ అభ్యర్థి భర్త
నాలుగు రోజులుగా అధికార పార్టీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీటీసీ రాయుడు గోవింద్ అన్నారు. అయినప్పటికీ.. నామినేషన్ వేయడానికి సిద్ధమైన క్రమంలో మా అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారని తెలిపారు. మమ్మల్నీ.. బెదిరించినప్పటికీ.. ఎక్కడ తగ్గకుండా ఈరోజు నామినేషన్ వేస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం రామవరం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ఇదీ చదవండి: