ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 15, 2020, 6:02 AM IST

ETV Bharat / state

సంక్రాంతి పండగ ప్రత్యేకత ఏంటి?

మకర సంక్రాంతి మూడురోజుల పండగ. తెలుగు లోగిళ్లలో ఈ పండగ వచ్చిందంటే ఊళ్ల.. కళే మారిపోతుంది. ఎక్కడ చూసినా.. పండగ వాతావరణమే కనిపిస్తుంది. ఇంతటి విశిష్టత ఉన్న సంక్రాంతిని.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకొంటారు. అసలు మకర సంక్రాంతి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

sankrathi festival
sankrathi festival

సంక్రాంతి పండగ ప్రత్యేకత ఏంటి?

సంక్రాంతిని పెద్ద పండగగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంటలే ప్రధాన ఆదాయ వనరులైన రైతుల చేతికి పంట వచ్చేది ఈ రోజుల్లోనే. ఈ కారణంగానే సంక్రాంతిని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. ప్రకృతికి కృతజ్ఞత చెబుతూ ఇళ్ల ముందు రకరకాల రంగులతో రంగవల్లులు వేస్తారు.

సంక్రాంతి అంటే నూతన కాంతి అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడమే సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భానికి... సంక్రమణం అని అర్థం వస్తుంది. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఇలా పుణ్యకాలం ప్రారంభం పండుగలా చేయడాన్ని తెలుగు వాళ్లు అనాదిగా శుభప్రదంగా భావిస్తున్నారు. ఆనవాయితీగా పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఉంటారు. అందుకే సంక్రాంతిని రైతుల పండుగగా అభివర్ణిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వస్తే.. గంగిరెద్దులు, రథం ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతులైన ఆడపడుచులు కనిపిస్తారు. కొత్త బియ్యంతో పిండి వంటలు చేసుకోవడం, ధాన్యాన్ని దానంగా ఇవ్వడం లాంటివి ఈ సమయంలో చేస్తారు. సంక్రాంతి కొత్త కాంతిని తెచ్చి ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు కూడా.. అంతే వైభవంగా తెలుగు వాళ్లంతా.. సంక్రాంతికి పండగ చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

చిన్నపిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?

ABOUT THE AUTHOR

...view details