Festival With Snow: రాష్ట్ర వ్యాప్తంగా భోగి పండుగ రోజు ప్రకృతి మంచు దుప్పటి మాటున దాగిపోయింది. చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలు ప్రసరించవలసిన సూర్యుడు మంచు దుప్పటి మాటున దాగాల్సి వచ్చింది. సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి భోగిమంటలు వెలిగించి భోగి పండుగకు శ్రీకారం చుట్టారు. ఆవు నెయ్యితో భోగి మంటలు వెలిగించి భోగి పిడకల దండలను మంటల్లో వేశారు.
ఆవు నెయ్యితో భోగి మంటలు: చీకటి తెరలను చీల్చుకుంటూ మంచు పరదాలను తొలగించుకుంటూ వెలుగు రేఖలు ప్రసరించే వేళ తెలుగు లోగిళ్ళలో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి భోగిమంటలు వెలిగించి భోగి పండుగకు శ్రీకారం చుట్టారు. ఉభయ గోదావరి జిల్లాలలో భోగి పండుగ వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. తణుకు ఉండ్రాజవరం పరిసరాల్లో భోగి పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఆవు నెయ్యితో భోగి మంటలు వెలిగించి భోగి పిడకల దండలను మంటల్లో వేశారు. భోగి పండుగ రోజు భోగిమంటలను వేస్తే ఆ మంటల సెగతో శరీరంలోని సర్వ రుగ్మతలు మటు మాయమవుతాయని ప్రజల విశ్వాసం.