ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి పిడకలంట.. 280 అడుగులంట.! - తూర్పు గోదావరి తాజా న్యూస్

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పండుగ ఏదైనా ఉందా అంటే టక్కున గుర్తొచ్చేది సంక్రాంతి. మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలో భోగి నాడు వేసే మంటల కోసం.. ఆవు పేడతో పిడకలను తయారు చేసేందుకు పోటీ పడతారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో బుచ్చమ్మ అగ్రహారానికి చెందిన 20 కుటుంబాలు.. 280 అడుగుల పొడవు గల భోగి పిడకల దండలు తయారు చేసి ఔరా అనిపించారు. భోగి రోజున ఈ దండను భోగిమంటల్లో వేసేందుకు సిద్ధం చేశారు.

Sankranti celebrations at Amalapuram in East Godavari district
సంక్రాంతి పిడకలంట.. 280 అడుగులంట.!

By

Published : Jan 11, 2021, 5:02 PM IST

తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలో ఆచార సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా ప్రతిబంబిస్తాయి. అందులో భాగంగా భోగి నాడు వేసే మంటల కోసం ఆవు పేడతో తయారు చేసిన పిడకల దండలను తయారు చేసేందుకు ప్రజలు పోటీ పడతారు. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో బుచ్చమ్మ అగ్రహారానికి చెందిన 20 కుటుంబాలు.. 280 అడుగుల పొడవు గల భోగి పిడకల దండలు తయారు చేసి ఔరా అనిపించారు. వీటి కోసం 15 రోజుల నుంచి ఆవు పేడను సేకరించినట్లు పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు.. సంక్రాంతి పర్వదినం విశిష్టతను పిల్లలకు తెలియజేయాలనే ఆశయంతో.. మహిళలు ఏకమై తయారు చేసినట్లు తెలిపారు. వీటిని భోగి రోజున ఈ దండను భోగిమంటల్లో వేసేందుకు సిద్ధం చేశారు.

సంక్రాంతి పిడకలంట.. 280 అడుగులంట.!

ABOUT THE AUTHOR

...view details