ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉభయగోదావరి జిల్లాలో జోరుగా కోడి పందేలు - sankranthi celebration in east godavari

ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడిపందేలు జరిగాయి. వందల బరులు ఏర్పాటు చేసి.. లక్షలకు లక్షలు పందేలు కట్టారు. బరులన్నీ జనంతో కిటకిటలాడాయి.

ఉభయగోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు
ఉభయగోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు

By

Published : Jan 15, 2020, 8:08 PM IST

ఉభయగోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని ఎదురులంక.. కేసనకుర్రు... చెయ్యరు.. గద్దనా పల్లిలో భారీ బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పందేలను తిలకించేందుకు మహిళలూ ఆసక్తి చూపారు. వారికోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పందెం లక్ష నుంచి రెండు లక్షలుగా నిర్వహించారు. నిమిషాల వ్యవధిలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. పందెం బరుల ప్రక్కనే గుండాటలు నిర్వహించారు. ఎదుర్లంక లో పందేలు కాసేందుకు వచ్చిన వ్యక్తికి గుండెపోటు వచ్చిన కారణంగా.. ఆస్పత్రికి తరలించారు.

కోడి పందెల్లో.. ఎంపీ అనురాధ

రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించి కబడ్డీ పోటీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు కోడి పందేలు ప్రారంభించారు. గ్రామస్తులు సరదాగా తెచ్చిన 2 కోడిపుంజులను పట్టుకునేందుకు ఎంపీ అనురాధ భయపడ్డారు. కోడికి కత్తులు కట్టకుండా కాసేపు పోటీలు నిర్వహించారు.

జోరుగా కోడిపందాలు, గుండాటలు

ఉభయగోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు

పి.గన్నవరం నియోజవర్గంలో కోడిపందాలు, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు హాజరై.. పందేలు కాశారు. బరిలో కోడి పుంజులు రక్తం కారుతున్నా... వీరోచితంగా పోరాడుతూ పందెం రాయుళ్లకు కాసులు కురిపించాయి. గుండాటలు అదే రీతిలో సాగాయి.

రెండో రోజు ఆచంటలో జోరుగా పందేలు

సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజవర్గ వ్యాప్తంగా రెండో రోజు కోడి పందాలు జోరుగా కొనసాగాయి. పెనుగొండ,పెనుమంట్ర మండలంలో కోడిపందేలతో పాటు గుండాట, పేకాటలు పెద్ద ఎత్తున నిర్వహించారు. పలు చోట్ల పోలీసులు ఆంక్షలు విధించగా.. కోడి పందేలు మాత్రమే జరిగాయి. రెండు రోజులుగా జరిగిన పందేల్లో లక్షల రూపాయిలు చేతులు మారాయి. బరుల వద్ద మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగాయి.

దెందులూరులో అడ్డంకులు

ఉభయగోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు

దెందులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించకుండా రెవిన్యూ, పోలీసు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పలు గ్రామాల్లో పందేల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ధ్వంసం చేశారు. అయినా పందేలు జరిగాయి. లక్షలు చేతులు మారాయి.

ఇవీ చదవండి:

తాడేపల్లిగూడెంలో ఈ పోటీలు చూస్తే... ఆశ్చర్యపోవాల్సిందే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details