కరోనా పాజిటివ్ కేసులు పెరగటంతో.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ వ్యాప్తంగా గ్రామాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ చల్లిస్తున్నారు. వీధుల్లో.. ఇళ్ల ముందు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని.. అధికారులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అమలాపురం డివిజన్లో శానిటైజేషన్ - amalapuram division sanitization latest news
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అధికారులు చర్యలు చేపట్టారు. డివిజన్ పరిధిలో శానిటైజేషన్ చేయిస్తున్నారు.
![అమలాపురం డివిజన్లో శానిటైజేషన్ sanitization in amalapuram division](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11645433-1064-11645433-1620186116438.jpg)
అమలాపురం డివిజన్లో శానిటైజేషన్