ప్రస్తుత సీజన్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందనీ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజనల్ పంచాయతీ అధికారి హరినాథ్ బాబు సూచించారు. గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు.
'అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండండి' - రంపచోడవరంలో పారిశుద్ధ్య పనులు వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో పైలెట్ ప్రాజెక్టుగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని పంచాయతీ అధికారి సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

రంపచోడవరంలో పారిశుద్ధ్య పనులు
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని హరినాథ్ బాబు సూచించారు. నీటికుంటల్లో, డ్రైనేజీల్లో లార్వా ఉండకుండా దోమల మందు పిచికారీ చేస్తున్నామని తెలిపారు. కాలువల్లో పూడికను తొలగిస్తున్నామని.. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి... : వెలిగొండ ప్రాజెక్టుపై కలెక్టర్ సమీక్ష... నిర్వాసితుల నిరసన