తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. సోమవారం జీజీహెచ్ ఎదుట సీఐటీయూ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. కొవిడ్ సేవల్లో ఉన్న కార్మికులకు రక్షణ పరికరాలు అందజేయాలని, ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని కోరారు. రెండు నెలల జీతం అదనపు ప్రోత్సాహకంగా ఇవ్వాలని.. కనీస వేతనం రూ.21వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇఎస్ఐ, పిఎఫ్ కాకినాడలోనే చెల్లించేలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కనీస వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - కనీస వేతనాల అమలు కోసం కాకినాడలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జీజీహెచ్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేయాలని జీజీహెచ్శానిటేషన్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు.
కనీస వేతనాల అమలు కోసం కాకినాడలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా