వరద ప్రవాహం వల్ల రోడ్డును అంచనా వేయలేక మురుగు కాలువలో పడిపోయిన బాలికను పారిశుద్ధ్య సిబ్బంది కాపాడారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం భారీ వర్షం కురిసింది. నగరంలో రోడ్డేదో.. కాలువ ఏదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని భాగ్యలలిత సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరి.. హైటెక్ బస్టాండ్ కూడలిలోని ప్రధాన మురుగు కాలువలో పడిపోయింది. అక్కడే పనులు చేపడుతున్న పారిశుద్ధ్య సిబ్బంది గమనించి వెంటనే వెళ్లి ఆమెను బయటకు లాగారు. సైకిల్, పుస్తకాల సంచి మాత్రం కొట్టుకుపోయాయి. విద్యార్థిని ప్రాణాలు కాపాడిన కార్మికులను స్థానికులు అభినందించారు.
మురుగు కాలువలో పడ్డ బాలిక.. కాపాడిన పారిశుద్ధ్య కార్మికులు
మురుగు కాల్వలో పడ్డ బాలికను పారిశుద్ధ్య సిబ్బంది కాపాడారు. ఈ ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. భారీ వర్షాలు పడుతుండడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. సైకిల్‌పై వెళుతున్న బాలిక ప్రమాదవశాత్తు అందులో పడింది. సిబ్బంది స్పందించి బాలిక ప్రాణాలు కాపాడారు.
Workers who rescued the girl