ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

15వ రోజుకు చేరుకున్న పంచాయతీ కార్మికుల ఆందోళన

జీతాల పెంపుదల ఆమలు చేయాలని కోరుతూ కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ కార్మికులు చేపట్టిన ఆందోళన 15 వరోజుకు చేరింది. ఈ నెలాఖరులోగా తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే నవంబర్ 1 నుంచి సమ్మె చేయక తప్పదని వారు హెచ్చరించారు.

ఆందోళన చేస్తున్న కార్మికులు
ఆందోళన చేస్తున్న కార్మికులు

By

Published : Oct 29, 2020, 1:53 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ కార్మికులు చేపట్టిన ఆందోళన 15వ రోజుకు చేరింది. ఈ సంద్భంగా యూనియన్ అధ్యక్షుడు మాతా గాంధీ, పిల్లి రాజశేఖర్​ మాట్లాడుతూ... పెరిగిన ధరలను బట్టి తమ కుటుంబ పోషణకి జీతాల పెంపుదలను అమలు చేయాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం, మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం తాము చేస్తున్న శ్రమను గుర్తించాలన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమ న్యాయమైన డిమాండ్లను ఈ నెలాఖరులోగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. లేని పక్షంలో నవంబర్ 1 నుంచి సమ్మె చేయక తప్పదన్నారు. ధర్నా అనంతరం ఈఓపీఆర్, ఆర్​డీ భాస్కర్​రావు సమక్షంలో చర్చలు జరిపారు. జీతాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతం మించకూడదని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి ఆదాయాన్ని తక్కువగా చూపించి జీతాలు పెరగకుండా అడ్డు పడుతున్నారని కార్మికులు భాస్కరరావుతో వాపోయారు. గడిచిన 3 సంవత్సరాల వార్షిక నివేదిక ల ఆధారంగా జమా ఖర్చులు బేరీజు వేసి నిర్ణయం తీసుకోవాలని, శనివారం మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details