తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి ఇసుక ర్యాంపులో అక్రమాలు జరుగుతుండటంతో అదనపు ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తనిఖీలు నిర్వహించారు. అధికారికంగా పులిదిండి ర్యాంపు మూతపడినా గోదావరి నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వినట్లు గుర్తించి, ర్యాంపు సమీపంలో ఉన్న పొక్లయినర్లు యంత్రాన్ని సీజ్ చేశారు. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాహనాలు సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
'ఇసుక ర్యాంపుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు' - ఏపీలో ఇసుక అక్రమ రవాణా వార్తలు
ఇసుక ర్యాంపుల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాహనాలు సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అధికారి గరుడ సుమిత్ సునీల్ అన్నారు.
ఇసుక ర్యాంపుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు