ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జొన్నాడ ఇసుక లారీ ర్యాంపుల వద్ద వివాదం - issue at east godavari dst sand reech

జొన్నాడ ఇసుక ర్యాంపుల వద్ద స్థానిక లారీ  డైవర్లుకు ఇతర ప్రాంత డ్రైవర్లకు  మధ్య గొడవ జరిగింది. పార్కింగ్ ఫీజులు తగ్గించి, అక్రమ వసూళ్లు అరకట్టాలంటూ  డ్రైవర్లు ధర్నా చేశారు.

sand lorry drivers issue at jonnada  east godavari
ఆందోళన చేస్తున్న ఇతర ప్రాంత ఇసుకు లారీ డ్రైవర్లు

By

Published : Dec 11, 2019, 5:29 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ ఇసుక ర్యాంపుల వద్ద.. లారీ యూనియన్ల సభ్యులకు ఇతర ప్రాంత లారీ డైవర్లకు మధ్య వివాదం జరిగింది. ఆన్​లైన్​లో బుక్ చేసుకుని ఇసుక తీసుకెళ్లేందుకు జొన్నాడ ఇసుక ర్యాంపు వద్దకు లారీలు అధిక సంఖ్యలో వస్తున్నాయి. వాహనాలు వరుస క్రమంలో కాకుండా మరో మార్గంలో వచ్చి ఇసుక తీసుకెళ్తున్నాయి. ఇలా అయితే వరుసల్లో ఉన్నవారు ఏమైపోవాలని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు 2, 3 రోజులు పడుతుందని కొందరు లారీ డ్రైవర్లు ఆందోళన చేశారు. దాంతోపాటు పార్కింగ్ ఫీజులు తగ్గించాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పటంతో వివాదం సద్దుమణిగింది.

ఆందోళన చేస్తున్న ఇతర ప్రాంత ఇసుకు లారీ డ్రైవర్లు


ఇదీ చూడండి..
శునకంలా ప్రవర్తిస్తున్న యువకుడు- ఎందుకు?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details