అక్రమంగా మట్టిని తరలిస్తున్న పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వీర్లంకపల్లిలో రాజు చెరువు నుంచి జేసీబీతో తవ్వి టిప్పర్లు ద్వారా అక్రమ లే అవుట్లకు తరలిస్తున్నారు. విషయాన్ని గమనించిన రైతులు ఇరిగేషన్ జేఈ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఐదు టిప్పర్లు, ఒక జేసీబీ మిషిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం వాహనాలను గోకవరం స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా.. వాహనాలు సీజ్ చేసిన పోలీసులు - తూర్ప గోదవరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణ వార్తలు
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే అంశంపై రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా పోలీసులు పలు వాహనాలను సీజ్ చేశారు.
ఇసుక అక్రమ రవాణా