ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్లను రక్షిద్దామంటూ సైకత శిల్పం

పర్యావరణాన్ని రక్షిస్తూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లాలో దీనిని ఇద్దరు యవతులు తీర్చిదిద్దారు.

By

Published : Jun 5, 2021, 10:36 AM IST

sand art by girls at east godavari
చెట్లను రక్షిద్దామంటూ సైకత శిల్పం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి.. దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు సైకత శిల్పాన్ని రూపొందించారు. చెట్లను కాపాడాలనే నినాదంతో.. కరోనా నుంచి భద్రతకావాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే సందేశాన్నిస్తూ దానిని తీర్చిదిద్దారు. చెట్లను రక్షిస్తే.. పర్యావరణాన్ని రక్షించినట్టే నంటూ సందేశాన్నిస్తూ రెండు చేతులతో చెట్టును, భూమిని ఒడిసి పట్టుకొని కాపాడుతున్నట్టుగా సైకత శిల్పాన్ని రూపొందించారు. అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details