ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sand Art: అంతర్జాతీయ బాలిక దినోత్సవం.. సైకత శిల్పం రూపకల్పన - sand art at east godavari latest news

అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సేవ్ గర్ల్స్ నినాదంతో ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రముఖ సైకత శిల్పి దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు.. దీనిని అందంగా తీర్చిదిద్దారు.

sand art at east godavari over save girl child theme
అంతర్జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకుని సైకత శిల్పం రూపకల్పన

By

Published : Oct 10, 2021, 4:53 PM IST

అంతర్జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకుని సైకత శిల్పం రూపకల్పన

తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ,ధన్యతలు సైకత శిల్పాన్ని రూపొందించారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సేవ్ గర్ల్స్ నినాదంతో వారు ఈ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు.

సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అనర్థాల నుంచి ఆడపిల్లలను కాపాడమని.. గర్భంలోని శిశువు.. అమ్మవారిని వేడుకుంటున్నట్టు ఈ సైకత శిల్పాన్ని మలిచారు. అందరిని ఆలోచింపజేసేలా మలచిన శిల్పాన్ని చూసేందుకు.. జనం తరలి వస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details