తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా పరీక్షలను వేగవంతం చేయటానికి సంచార సంజీవని వాహనాన్ని ప్రారంభించారు. కరోనా నిర్థారణ పరీక్షలకు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంజీవని వాహనాన్ని అమలాపురంలో ఆర్డీవో బీహెచ్ భవాని శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంజీవని వాహనం ద్వారా అత్యంత వేగంగా కరోనా పరీక్షల ఫలితాలు పొందవచ్చునని వివరించారు.
'ఇక కొన్ని నిమిషాల్లోనే కరోనా పరీక్షల ఫలితాలు' - amalapuram sanchar sanjivini vehicle
కరోనా పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూడకుండా.. కేవలం నిమిషాల వ్యవధిలోనే పొందవచ్చు. సంచార సంజీవని వాహనం ద్వారా ఇది సాధ్యమవుతుందని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో బీహెచ్ భవాని శంకర్ తెలిపారు.

సంచార సంజీవని వాహనం