ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ - ఆత్రేయపురం తాజా వార్తలు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో వర్షంతో నీటిముంపునకు గురైన నేపథ్యంలో.. వేద పండితులు సంప్రోక్షణ నిర్వహించారు.

Samprokshan Pujas at Sri Venkateswara Swamy Temple
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ పూజలు

By

Published : Oct 14, 2020, 2:11 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భారీ వర్షంతో నీట మునిగింది. ఆలయంలో పూజారులు సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ చుట్టుపక్కల ప్రాంగణాలు, క్షేత్రపాలకుడైన వీరేశ్వరస్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది.

దేవాదాయ శాఖ అధికారులు మోటార్ల సహాయంతో నీటిని బయటకు తొలగించారు. వేద పండితులు సంప్రోక్షణ పూజలు నిర్వహించి... స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం చేసుకోవడానికి అనుమతిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details