రైతులు ఇళ్ల వద్ద పక్షుల కోసం వరి కుచ్చులు కట్టేవారు. వీటిని ప్రత్యేకంగా వరి కంకులతో కళాఖండంగా తయారు చేసేవారు. రానురాను ఇవి కూడా అరుదైపోయాయి. వీటిని తయారుచేయడంలో అనుభవం ఉన్న అతితక్కువ మంది… రైతుల వద్ద వరికంకులు కొనుగోలుచేసి వరికుచ్చులను తయారుచేసి అమ్ముతున్నారు. కోనసీమలో ఓ వ్యక్తి తోపుడుబండి మీద వీటిని పెట్టి విక్రయిస్తున్నారు. పక్షుల ప్రేమికులు వరి కుచ్చులు కొనుగోలు చేసి ఇళ్ల వద్ద కడుతున్నారు. ఒక్కో కుచ్చు 300 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నాడు.
కోనసీమలో పక్షుల కోసం వరికుచ్చుల విక్రయాలు - కోనసీమలో వరికుచ్చుల విక్రయాలు
రైతులు పక్షుల కోసం ఇళ్ల వద్దే వరి కుచ్చులు తయారు చేసుకునేవారు. కోనసీమలోని పలు గ్రామాల్లో ఇప్పటికీ అక్కడక్కడ ఇవి తయారు చేస్తుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఓ వ్యక్తి వరి కుచ్చులకు తయారు చేసి విక్రయిస్తున్నాడు.
కోనసీమలో వరికుచ్చుల విక్రయాలు