సీఎం జగన్ పాదయాత్ర చేసి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని సీఆర్సీ వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాల్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి పాల్గొన్నారు. వృద్ధుల బాగోగులను సజ్జల అడిగి తెలుసుకున్నారు.
రావులపాలెంలో గౌతమి వంతెన వద్ద అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు నమూనాపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమంలో సజ్జల పాల్గొన్నారు. వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న ఏఎన్ఎంలు తమ సమస్యలను పరిష్కరించాలని సజ్జలకు వినతిపత్రం అందించారు.