తూర్పు గోదావరి జిల్లా తునిలో ఉన్న బ్యాంకుల వద్దకు ఖాతాదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం జమ చేసిన నగదును తీసుకునేందుకు వందలాది మంది బ్యాంకుల వద్ద బారులు తీరారు. భౌతిక దూరం పాటించాలని ఒకవైపు అధికారులు సూచిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా నిలబడి నగదు తీసుకువెళ్లారు. వారు భౌతిక దూరం పాటించేలా చూడాలని స్థానిక ప్రజలు అధికారులను కోరారు.
బ్యాంకుల వద్ద ఖాతాదారుల బారులు - rush at banks
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ బ్యాంకు వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ప్రభుత్వం జమచేసిన నగదును తీసుకునేందుకు భారీగా తరలివచ్చారు.
బ్యాంకుల వద్ద బారులు తీరిన ఖాతాదారులు