ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సులు లేక.. రాకపోకలు కుదరక! - buses problem rural people at east godavari district

లాక్​డౌన్ సడలింపుతో వారం రోజులుగా ప్రధాన బస్సు డిపోల నుంచి పరిమిత సంఖ్యలో బస్సులు నడుపుతున్నప్పటికీ ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావటం లేదు. ఈ పరిస్థితి ప్రధాన కారణం బస్సుల రాకపోకలు... వాటి సమయం... వెళ్ళే మార్గాలు టిక్కెట్ విక్రయ కేంద్రాల వివరాలు ప్రయాణికులు తెలియకపోవడమే. అంతే కాక.. బస్సులన్నీ హైవే రూట్ లో వెళ్లటం, బస్టాండ్లు ఊరి మధ్యలో ఉండడమూ మరో కారణంగా నిలుస్తోంది.

Rural people  get buses or get into trouble at mummidivaram east godavari district
బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలు

By

Published : Jun 9, 2020, 6:32 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక ఆదాయం అందించే అమలాపురం, కాకినాడ డిపోల నుంచి ఇంతకుముందు రోజుకు 25 ఎక్స్​ప్రెస్ బస్సులు నడిచేవి. ఇవి జిల్లాలోని రాజోలు నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి వరకు ప్రయాణీకులను తరలించేవి. కాని ప్రస్తుతం కొన్నిబస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అవి కూడా హైవే మీదుగా వెళ్తున్నాయి.

ఇక జిల్లాలోని ముమ్మడివరం పరిధిలోని 20 గ్రామాలకు చెందిన ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 50 వరకు పల్లెవెలుగు బస్సులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వాటిలో రెండవ వంతు మాత్రమే బస్సులు తిరుగుతుండగా... అవి కూడా హైవే మార్గంలో వెళ్తుండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details