తూర్పు గోదావరి జిల్లా తుని డిపో నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోకలు ప్రారంభించాయి. డిపో నుంచి 15 బస్సులను మాత్రమే కాకినాడ, రాజమహేంద్రవరం, నర్సీపట్నం మార్గాల్లో నడుపుతున్నారు. పరిమిత సంఖ్యలో స్టేజీలు ఏర్పాటు చేశారు.
తుని: ప్రయాణికుల సేవలో 15 బస్సులు - Lockdown in tuni
తూర్పు గోదావరి జిల్లా తునిలో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి రోజు డిపో నుంచి 15 బస్సులనే నడుపుతున్నారు.
Rtc started in east godavari
కాకినాడ మార్గంలో తుని, అన్నవరం, కత్తిపూడి, పిఠాపురం… రాజమహేంద్రవరం మార్గంలో తుని, అన్నవరం, కత్తిపూడి, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం…. నర్సీపట్నం మార్గంలో తుని, కోటనందురులో మాత్రమే స్టేజీలు ఏర్పాటు చేశారు. ఆయా స్టేజీల్లోనే టిక్కెట్లు ఇస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు.
TAGGED:
Lockdown in tuni