తూర్పుగోదావరి జిల్లా తుని ఆర్టీసీ డిపో నుంచి.. ముందుగా కేవలం 15 బస్సులను మాత్రమే నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తుని డిపో నుంచి కాకినాడకు 7, రాజమహేంద్రవరానికి 5, నర్సీపట్నానికి 3 బస్సులు నడపనున్నారు. రాజమహేంద్రవరం, నర్సీపట్నం డిపోల నుంచి కూడా ఇదే సంఖ్యలో బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడుస్తాయని తెలిపారు.
బస్సులో కండక్టర్లు లేకుండా కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటారన్నారు. ప్రయాణికులు బస్ స్టాండ్ వద్ద టికెట్టు తీసుకుని బస్సు ఎక్కాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఆర్డినరీ బస్సులను మాత్రమే నడుపనున్నట్లు, అవి కూడా పరిమిత స్టేజీల్లోనే అగుతాయని స్పష్టం చేశారు. ఆయా బస్టాండ్ల వద్ద కండక్టర్లు అందుబాటులో ఉంటారు. వారి వద్ద టిక్కెట్టు తీసుకుని బస్ ఎక్కాల్సి ఉంటుందని వివరించారు.
తుని నుంచి రాజమహేంద్రవరం మార్గంలో...
- అన్నవరం
- కత్తి పూడి
- ప్రత్తిపాడు
- జగ్గంపేట
- రాజనగరం
తుని- కాకినాడ మార్గంలో...
- అన్నవరం
- కత్తిపూడి
- పిఠాపురం
తుని నుంచి నర్సీపట్నం మార్గంలో...
- కోటనందురుల