ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏ నిమిషానికి.. ఏమి ఊడునో.. ఆర్టీసీ బస్సులో! - bus damege

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్నాడో సినీ కవి. ప్రస్తుత ఆర్టీసీ బస్సులోని పరిస్థితి చూస్తే... ఏ నిమిషానికి ఏమి ఊడునో ఎవరూహించెదరు... అంటున్నారు ఆర్టీసీ ప్రయాణికులు.

RTC bus bumper suddenly blown out at east godavari
ఏ నిమిషానికి.. ఏమి ఊడునో.. ఆర్టీసీ బస్సులో!

By

Published : Dec 27, 2021, 11:49 AM IST

ఏ నిమిషానికి ఏమి ఊడునో అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు దుస్థితి. ఎక్కడికక్కడ రహదారులు దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి... తరచూ బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయి.తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ పై ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న సమయంలో బంపర్ ఊడిపడింది. రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెళ్తుండగా బంపర్ ఊడిపడి పెద్ద శబ్దం రావడంతో బస్సులోని ప్రయాణికులు ఏమైందో తెలియక భయాందోళనకు గురయ్యారు. బస్సు ఆపిన ఆర్టీసి సిబ్బంది వెంటనే బంపర్​ను బస్సులో వేసుకుని వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details