తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లోని తొమ్మిది మండలాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 5 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. ఆయా మండలాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. చెరువుల తవ్వకాలు, కాలువల్లో పూడిక తీత, నీటి కుంటలు ఏర్పాటు, తదితర పనులు చేస్తున్నారు.
తద్వారా రోజు సుమారు 17 వేల మంది కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఆసక్తి గల రైతులు ముందుకు వస్తే ఈ పథకంలో పూల సాగుకు అవకాశం కల్పిస్తామని ఉపాధి హామీ పథకం పి.గన్నవరం ఏపీ డి. కోటేశ్వర రావు తెలిపారు.