ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Save Life: రైలు ఎక్కుతూ జారిపడ్డ ప్రయాణికుడు... కాపాడిన పోలీసులు

Police saved passenger: వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు పట్టు జారి పడిపోయాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆయనను కాపాడారు. ఈ ఘటన కాకినాడలోని రైల్వే స్టేషన్​లో జరిగింది.

police saved passenger
police saved passenger

By

Published : Feb 19, 2022, 7:20 AM IST

Police saved passenger: కదులుతున్న రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడిని పోలీసులు కాపాడారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. శుక్రవారం తిరుపతి వెళ్లే రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌ రెండో నంబరు ప్లాట్‌ఫాం నుంచి కదులుతోంది. డి. రమేశ్‌ అనే ప్రయాణికుడు పరిగెత్తుకుంటూ రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. పట్టుతప్పి రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో పడి ఇరుక్కుపోయాడు.

రైలు ఆయన్ను ఈడ్చుకుంటూ వెళ్తుండగా గస్తీలో ఉన్న టౌన్‌ రైల్వేస్టేషన్‌ సీఐ డి.రామారావు, కానిస్టేబుల్‌ జగదీశ్‌ పరుగున వెళ్లి అతి కష్టం మీద అతడు రైలు కింద పడిపోకుండా పట్టుకున్నారు. సీఐ.. రమేశ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తూనే.. చైన్‌ లాగి బండిని ఆపాలంటూ అరుస్తూ రైలులో ఉన్నవారిని అప్రమత్తం చేశారు. అప్పటివరకు సీఐ, కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో రైలుతో సమానంగా పరిగెడుతూ ప్రయాణికుడు పూర్తిగా పడిపోకుండా పట్టుకున్నారు. చివరికి రైలు ఆగిపోయాక అతన్ని బయటికి తీశారు.

ABOUT THE AUTHOR

...view details