బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు రహదారులు గుంతలు పడి వర్షపు నీరు నిలిచిపోయి.. వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమలాపురం, బొబ్బర్లంక, జీ పెదపూడి, పొదలాడ, అంబాజీపేట, గన్నవరం, ముక్తేశ్వరం రహదారులు ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ రహదారుల మీదుగా వాహనాలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, తిరుపతి... ప్రాంతాలకు వెళుతుంటాయి. కోనసీమకు రైల్వే మార్గం లేకపోవటం.. రోడ్డు రవాణా.. ప్రధానం అవడంతో వర్షాలకు రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. వీటిని అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరో మూడు నెలల పాటు వర్షాకాలం ఉంటుంది. అప్పటిలోగా ఈ రహదారులు మరింత దెబ్బతింటాయి. కనీసం గుంతలనయినా పూడ్చాలని ప్రజలు మొరపెట్టుకున్నారు.
దెబ్బతిన్న రోడ్లు.. ఇబ్బంది పడుతున్న చోదకులు
తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా.. రహదారులు దెబ్బతిన్నాయి. గుంతలు పడి వర్షపు నీరు నిలిచిపోవటంతో చోదకులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
దెబ్బతిన్న రోడ్లు