వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. అమలాపురం, పీ. గన్నవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, కొత్తపేట, అంబాజీపేట, రావులపాలెం, ఆత్రేయపురం తదితర మండలాల్లోని రహదారులు మరింత దారుణంగా మారాయి. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
రోడ్లు అధ్వానం... ఇలాగే ఉంటే సాగేనా ప్రయాణం? - konaseema latest news
తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు.. కోనసీమ పరిధిలోని రహదారులు గుంతలు పడి అధ్వానంగా మారాయి. ఈ మార్గాల్లో ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

కోనసీమలో ధ్వంసమైన రహదారులు
కోనసీమలో ధ్వంసమైన రహదారులు