తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు పండ్ల మార్కెట్ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారి గుంతలమయమైంది. భారీ వర్షాలు వల్ల గోతులు పడిపోయి ప్రమాదకరంగా మారింది. కిలోమీటర్లు కొద్ది ఇదే దుస్థితి కనిపిస్తోంది. దీని వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయి. నిత్యం ప్రమాదాలూ జరుగుతున్నాయి.
జాతీయ రహదారి గుంతలమయం... ప్రమాదంలో ప్రయాణం - తూర్పుగోదావరి జిల్లా వాతావరణం వార్తలు
తరచూ వచ్చే వరదలతో జాతీయ రహదారులు తీవ్ర నష్టానికి గురవుతున్నాయి. ఎక్కడికక్కడ గుంతలు పడుతున్నాయి. అలాంటి రహదారుల్లో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. వాహనాలు బాగా దెబ్బతింటున్నాయి. ఇలాంటి దుస్థితిలోనే ఉంది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని జాతీయరహదారి.

జాతీయ రహదారి గుంతలమయం... ప్రమాదంలో ప్రయాణం
రాత్రివేళల్లో కార్లు టైర్లు పేలిపోయి టైర్లు పాడైపోతున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాపిక్ క్రమబద్దీకరిస్తుంటారు. ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వారికీ ప్రమాదాలు తప్పడం లేదు. తరచూ ప్రమాదాలు జరగడాన్ని గమనించిన పోలీసులు... ఆప్రాంతంలో ప్రయాణించే సమయంలో నెమ్మదిగా వెళ్లాలని అవగాహన కల్పిస్తున్నారు. ఎన్ని చేసినా యుద్దప్రాతిపదికన గోతులు పూడ్చాల్సిన స్థానికులు కోరుతున్నారు.