Road Situation In Anaparti With tdp Flexi: రహదారుల దుస్థితిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ వినూత్నంగా నిరసన తెలిపింది. కెనాల్ రహదారికి ఇరువైపులా "ఇదేం కర్మ మన రాష్ట్రానికి", "ఇదేం కర్మ ఈ కెనాల్ రహదారికి" అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. రహదారి దుస్థితిని వివరించింది. అధ్వానంగా ఉన్న రహదారికి ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఫ్లెక్సీలను ప్రజల ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇప్పటికైనా రహదారి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
రహదారి దుస్థితిపై అనపర్తిలో టీడీపీ వినూత్న నిరసన - East Godavari latest news
Road Situation In Anaparti With tdp Flexi: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గోతులమయంగా తయారయ్యాయి. గోతుల రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. తాజాగా అనపర్తి కెనాల్ రహదారి దుస్థితిపై టీడీపీ వినూత్నంగా నిరసన తెలిపింది.
ROAD
Last Updated : Dec 9, 2022, 4:49 PM IST