ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోటెత్తిన వరద నీరు.. తెగిపోయిన రహదారి - పి గన్నవరం వార్తలు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం బూరుగు లంక వద్ద వరద పోటెత్తింది. దీంతో రహదారి తెగిపోయింది. స్థానిక ఎమ్మెల్యే ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రామస్థులు ఇబ్బందిపడకుండా నదీ పాయలో మర పడవలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

east godavari dist
పోటెత్తిన వరద నీరు తెగిపోయిన రహదారి

By

Published : Jul 10, 2020, 12:38 AM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం బూరుగు లంక వద్ద వశిష్ఠ గోదావరి అనుబంధ పాయలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో రహదారి తెగిపోయింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గురువారం రాత్రి ఈ ప్రదేశాన్ని పరిశీలించారు. ఇక్కడ రహదారి తెగిపోవడంతో ఉడుముండి లంక, అరిగెల వారి పేట, బూరుగు లంకజీ, పెదపూడి లంక ఇలా నాలుగు లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు నెలకొన్నాయి. లంక గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే ఈ నదీ పాయలో మర పడవలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details