తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఈనాడు-ఈటీవీ ఉద్యోగులు బెల్టు ధరించటంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లారీ... కారుతోపాటు రెండు వాహనాలను ఢీకొట్టింది. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రత్తిపాడు పీహెచ్సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ వెనకనుండి కారును డీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఈనాడు- ఈటీవీ ఉద్యోగులు ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
road accidnet in east godavari dst injured eenadu etv employees