తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై రావులపాలెం వైపు వెళ్తున్న వారిని....రాజమహేంద్రవరం నుంచి వస్తున్న మినీ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. మృతులు మూలస్థాన అగ్రహారానికి చెందిన రైతులు కర్రి విష్ణు, ఇనపకోళ్ల శ్రీను, తోరాటి రాంప్రసాద్‌గా గుర్తించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ..ముగ్గురు మృతి - జొన్నాడలో రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
జొన్నాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం