తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం - cirme news jangareddy gudem
ద్విచక్రవాహనం పై వెళ్తున్న ఓ వ్యక్తికి వ్యాన్ ఢీకొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జంగారెడ్డి గూడెం మండలం జిల్లా తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి గుజరాత్ వెళ్తున్న వ్యాన్... ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీఆర్ఏ పఠాన్ అహ్మద్ ఖాన్ను ఢీకొట్టింది. అహ్మద్ ఖాన్ తలకు బలమైన గాయం కావటంతో పాటు కుడి కాలు విరిగిపోయింది. అహ్మద్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు ఏలూరు తరలించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.