తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం పరిధిలో.. ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఆపాయం కలగలేదు. రాజమండ్రి నుంచి మల్కిపురానికి ఇసుక లోడుతో వెళ్తున్న లారీ.. తాటిపాక నుంచి రావులపాలెం వెళుతున్న కారును ఢీ కొట్టింది.
గన్నవరంలో కారు, లారీ ఢీ.. విరిగిన విద్యుత్ స్తంభం - గన్నవరం లో రోడ్డు ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం లో ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.ఈ క్రమంలో.. లారీ రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా తాకగా అది విరిగిపోయింది.
Accident
కారు, లారీల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. అదుపు తప్పిన లారీ.. రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా అది విరిగిపోయింది. ఈ కారణంగా ట్రాన్స్కో 15 వేల రూపాయల నష్టం జరిగిందని అధికారి జీవి ఆచార్య తెలిపారు. ప్రమాదం కారణంగా రెండు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.