తూర్పుగోదావరి జిల్లా తుని మండలం గెడ్లబీడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ పట్నం వైపు నుంచి గొల్లప్రోలు వైపు చింతపండు లోడుతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని.. విశాఖ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ దాటుకుని దూసుకువచ్చి ఢీ కొట్టింది. అనంతరం ఆ లారీ పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది.
లారీ, టాటా మ్యాజిక్ వాహనం ఢీ..ఇద్దరు మృతి.. - లారీ, టాటా మ్యాజిక్ వాహనం ఢీ
లారీ, టాటా మ్యాజిక్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గెడ్లబీడు జాతీయ రహదారిపై జరగగా... క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
లారీ, టాటా మ్యాజిక్ వాహనం ఢీ..ఒకరు మృతి !
ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌లో ప్రయాణిస్తున్న బుజ్జి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మరో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. వీరిని 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..శివ అనే వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: కలహాల కాపురం.. తీసింది ముగ్గురి ప్రాణం
Last Updated : Jun 29, 2020, 7:36 PM IST