ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - నెల్లూరు జిల్లా నేర వార్తలు

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Jun 2, 2021, 8:17 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మడికి గ్రామానికి చెందిన ఉండమట్ల రాజు(45) రోడ్డు దాటుతుండగా రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆలమూరు ఎస్సై శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం...

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోతిరెడ్డిపాలెం సమీపంలోని గంగవరం కాలువ వద్ద వేగంగా వచ్చిన కారు, రెండు మోటారు సైకిళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుడు పోతిరెడ్డిపాలేనికి చెందిన రహమత్ గా గుర్తించారు. బుజ్జయ్య అనే మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చంద్రబాబు లేఖలు.. ఫ్రంట్​లైన్ వారియర్స్​కు అందజేత

ABOUT THE AUTHOR

...view details