అందరూ నవ్వుతూ, సరదాగా ప్రయాణం చేస్తున్నవేళ.. రోడ్డు ప్రమాదం వారి జీవితాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొని తల్లిదండ్రులు మృతి చెందగా..మూడేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
విషాదం: కళ్లేదుటే తల్లిదండ్రులు మృతి.. గుక్కపట్టి ఏడ్చిన చిన్నారి - తుని రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి వార్తలు
అప్పటిదాకా సరదాగా అమ్మతో ముద్దుముద్దుగా ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తున్న చిన్నారికి విధి అమ్మను లేకుండా చేసింది. ద్విచక్రవాహనం నడుపుతున్న నాన్న..ఒక్కసారిగా దూరంగా పడిపోవడం చూసి.. బాబు గుక్కపట్టి ఏడ్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని తల్లిదండ్రులు మరణించగా..చిన్నారి వాళ్లను పిలిచిన తీరు అందరినీ కలచివేసింది.
![విషాదం: కళ్లేదుటే తల్లిదండ్రులు మృతి.. గుక్కపట్టి ఏడ్చిన చిన్నారి road accident at thuni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10103766-323-10103766-1609671363592.jpg)
తునిలో రోడ్డు ప్రమాదం
తునిలో రోడ్డు ప్రమాదం
తునికి సమీపంలో డెక్కన్ కెమికల్స్‌లో పని చేస్తున్న కరీం... వారి స్వగ్రామం రాజమహేంద్రవరం నుంచి తునికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీం అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్య ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. మూడేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండటం చూసి చిన్నారి రోదించిన తీరు.. అందరినీ కంటతడి పెట్టించింది.
ఇదీ చూడండి.మల వ్యర్థాల శుద్ధీకరణ దిశగా ముందడుగు