తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలం తాళ్లూరు పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. రాజమహేంద్రవరం నుంచి ఇద్దరు వ్యక్తులు స్కూటీపై జగ్గంపేట వైపు వెళ్తుండగా తాళ్లూరు పెట్రోల్ బంకు వద్ద వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.